
నాగ్‌పూర్: ఐటీఎఫ్ విమెన్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి సహజ యమలాపల్లి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సహజ 3–6, 6–1, 6–1తో వైదేహి చౌదరీపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో శ్రీవల్లి భమిడిపాటి 3–6, 6–1, 4–6తో అంటాసియా జొలోటరెవా (రష్యా) చేతిలో ఓడింది. డబుల్స్‌లో సహజ–మరియానా టోనా 7–5, 4–6, 10–8తో శర్మదా బాలు–రినోన్ ఒకువాకి (జపాన్)పై నెగ్గి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సహజ.. వైల్డ్ కార్డు ఎంట్రీ సోనాల్ పాటిల్‌తో తలపడుతుంది.