హైదరాబాద్, వెలుగు: టెన్నిస్‌లో దూసుకెళ్తున్న తెలంగాణ అమ్మాయి యమలపల్లి సహజ దేశంలోనే నంబర్ వన్‌ప్లేయర్‌గా మారింది. విమెన్స్ సింగిల్స్‌లో సీనియర్ ప్లేయర్ అంకితా రైనాను వెనక్కునెట్టి ఇండియా టా ర్యాంప్క్‌కు చేరుకుంది. లెజెండరీ ప్లేయర్ సానియా మీర్జా తర్వాత తెలంగాణ నుంచి ఈ ఘనత అందుకున్న ప్లేయర్‌గా నిలిచింది. ఖమ్మం జిల్లాకు చెందిన సహజ ఇటీవల జులైలో అమెరికాలో జరిగిన సోకల్ ప్రో సిరీస్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ నెగ్గింది. దాంతో ఓ ఐటీఎఫ్ ప్రో ట్రోఫీ గెలిచిన దేశ మూడో ప్లేయర్‌గా నిలిచింది. గతవారం ఐటీఎఫ్ పుంటా కనా టోర్నీలో సెమీస్‌చేరుకుంది.
దాంతో సోమవారం విడుదలైన విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూటీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో సహజ 303 నుంచి 301వ ర్యాంక్‌కు చేరుకుంది. అంకితా రైనా 25 స్థానాలు దిగజారి 307వ ర్యాంక్‌కు పడిపోయింది. సానియా మీర్జా తర్వాత చాన్నాళ్లు దేశ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచిన అంకితా ఆ స్థానాన్ని సహజకు కోల్పోయింది. హైదరాబాద్‌ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక రెండు స్థానాలు మెరుగై 374వ ర్యాంక్‌కు చేరుకుంది. ఇండియా నుంచి సహజ నంబర్‌వన్ ప్లేయర్‌గా మారగా.. అంకిత, శ్రీవల్లి తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు.