సహారా స్కాంలో కీలక అప్డేట్.. డైరెక్టర్ రావిపాటి అరెస్ట్..

సహారా స్కాంలో కీలక అప్డేట్.. డైరెక్టర్ రావిపాటి అరెస్ట్..

హైదరాబాద్: సహారా ఇండియా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆల్ ఇండియా డైరెక్టర్ రావిపాటి రామకోటేశ్వరరావును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సహారా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ పేరుతో  దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించిన సంస్థ సేకరించింది. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో సంస్థ చైర్మన్ సుబ్రతారాయ్ గతంలో జైలుకు వెళ్లి, బెయిల్ పై వచ్చాక మరణించిన సంగతి తెలిసిందే. అయితే సంస్థలో డైరెక్టర్ గా ఉన్న రావిపాటి రామకోటేశ్వరరావు పై సుమా రు 744 నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. 

ALSO READ | జాబ్ మేళాకు పోటెత్తిన సీనియర్ సిటిజన్స్.. ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ

గత కొన్ని నెలలుగా రామ కోటేశ్వరరావు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇటీవల న్యాయస్థానం జారీ చేసిన 15 వారెంట్ లను హైదరాబాద్ నగర సిపి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ గా తీసుకొని , సిసిఎస్ పోలీసులకు అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. అధికారులకు ప్రత్యేక దృష్టి సాధించడంతో కోటేశ్వరరా వు ను శనివారం అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. అతన్ని ఆదివారం న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్లు సైఫాబాద్ సిఐ తెలిపారు.