సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్మీనారాయణకు 14 రోజుల రిమాండ్..

సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్మీనారాయణకు 14 రోజుల రిమాండ్..

సాహితి గ్రూప్ ఇన్ ఫ్రా లక్ష్మీనారాయణకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.  లక్ష్మీనారాయణను చంచల్ గూడ  జైలుకు తరలించారు ఈడీ అధికారులు.  14 రోజుల పాటు తమకు కస్టడీకి అనుమతించాలని కస్టడీ పిటిషన్ ఫైల్ చేశారు ఈడీ అధికారులు. అయితే  అక్టోబర్ 1న  కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సాహితి ఇన్ఫ్రా లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదికి సూచించారు జడ్జి.

రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను  ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. సాహితి రికార్డులను పరిశీలిస్తూ..  భూములు కొనుగోలు చేసిన వారిపై ఈడీ నిఘా పెట్టింది. వైద్య పరీక్షల అనంతరం సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ కార్యాలయానికి  తీసుకెళ్లి వివరాలు రాబట్టారు.  సాహితీకి సంబంధించిన ప్రాజెక్టులలో నగదు బదిలీపై ఈడీ ఆరా తీసింది.

ALSO READ | Sahithi Infra Case: సాహితీ ఇన్ఫ్రాలో భూములు కొనుగోలు చేసిన వారిపై ఈడీ నిఘా

లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. సాహితీ ఇన్ఫ్రా పెట్టుబడుల సొమ్మును ఎక్కడకు తరలించారనే దానిపై ఆరా తీసిన ఈడీ, సాహితీ ఇన్ఫ్రా పేరుతో అనేక మోసాలకు పాల్పడినట్లు గుర్తించింది.  లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసిన ఈడీ నాంపల్లి  కోర్టులో ప్రవేశ పెట్టింది. దీంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది