పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ తెలుగులో రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైనట్లు సాహిత్య అకాడమీ ప్రకటించింది. హిందీ కవయిత్రి గగన్​ గిల్, ఆంగ్ల రచయిత్రి ఈస్టిరిన్​ కైర్​లతో సహా 21మందికి వార్షిక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. 21 భాషల్లో వచ్చిన నవలలు, చిన్న కథలు, కవిత్వాలు, వ్యాసాలు, నాటకాలతో సహా పలు సాహితీ రూపాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు విజేతలను ఎంపిక చేశారు. సాహితీ విమర్శనాత్మక రచనకుగాను పెనుగొండ లక్ష్మీనారాయణతోపాటు కన్నడ నుంచి కేవీ నారాయణ, మరాఠీ నుంచి సుధీర్​ రసల్​ అవార్డులకు ఎంపికయ్యారు. 

 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 

కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954లో స్థాపించింది. రాజ్యాంగం గుర్తించిన భాషలతోపాటు అకాడమీ పరిగణనలోకి తీసుకున్న మరికొన్ని భాషలు(ఇంగ్లీష్, రాజస్థానీ) కలిపి మొత్తం 24 భాషల సాహిత్యవేత్తలకు ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. అవార్డు గ్రహీతలకు జ్ఙాపిక, శాలువాతోపాటు రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తుంది. 
అకాడమీ ప్రకటించే ఇతర పురస్కారాలు

భాషా సమ్మాన్​ పురస్కారం

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద బహుమతి
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం