ఖానాపూర్లో వైభవంగా సాయిబాబా ఆలయ జాతర

ఖానాపూర్లో వైభవంగా సాయిబాబా ఆలయ జాతర

ఖానాపూర్, వెలుగు : ఖానాపూర్ పట్టణంలోని జంగల్ హనుమాన్ సాయిబాబా ఆలయ 28వ వార్షికోత్సవంలో భాగంగా శనివారం జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో మహాకుంభాబిషేకం, శివపార్వ తులు, శ్రీలక్ష్మీ నారాయణ శాంతి కల్యాణమహోత్సవ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ, అర్చకుడు శశిధర్ శర్మ ఆధ్వర్యంలో   నిర్వహించారు. 

వేలాదిగా తరలివచ్చిన జనం సాయిబాబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి జాన్సన్ నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా మహా అన్నదానం కోసం ఎమ్మెల్యే 40 క్వింటాళ్ల బియ్యాన్ని విరాళంగా అందజేశారు. పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.