చిరు అతని పేరు..సినీ ఖ్యాతిని పెంచడం తన పోరాటం: సాయి ధరమ్

మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్( Padma Vibhushan) అవార్డు వరించడం పట్ల..సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. లేటెస్ట్ గా చిరు ముద్దుల అల్లుడు సాయి ధరమ్(Sai Dharam) తనదైన పోస్ట్తో మామయ్య చిరంజీవిపై ఉండే అభిమానాన్ని..ఆయన సాధించిన గౌరవాన్ని తెలుపుతూ పోస్ట్ చేశారు.

'చిరు అతని పేరు..దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అతను సాధించిన గౌరవం అంటూ పోస్ట్ లో తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమను ఉన్నతంగా ఉంచడం అతని పోరాటం..ది వన్ & ఓన్లీ బాస్..ది మెజెస్టిక్, అతని అసమానమైన వారసత్వం మా సొంతం అని సాయి ధరమ్ తన ప్రేమను వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దేశం మొత్తంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. నటుడుగా, రాజకీయ నాయకుడుగా..సమాజ సేవకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన చిరుకి ఈ అవార్డు రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు.