SDT18 Teaser: సాయి దుర్గ తేజ్ పీరియడిక్ యాక్షన్ టీజర్ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే?

SDT18 Teaser: సాయి దుర్గ తేజ్ పీరియడిక్ యాక్షన్ టీజర్ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే?

సాయి దుర్గ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్షన్‌‌లో ఓ సినిమా రూపొందుతోంది. ‘హనుమాన్’ లాంటి సూపర్ హిట్ మూవీ నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. తేజ్ కెరీర్‌‌‌‌లో ఇది 18వ చిత్రం.

హై బడ్జెట్‌‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి శుక్రవారం అప్‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 12న టైటిల్‌‌ అనౌన్స్‌‌మెంట్‌‌తో పాటు వీడియో గ్లింప్స్‌‌ను విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. ఈ హై-ఆక్టేన్, పీరియడిక్ యాక్షన్ డ్రామాలో మునుపెన్నడూ పోషించని పవర్‌‌‌‌ఫుల్‌‌ రోల్‌‌లో సాయితేజ్ కనిపించనున్నాడు.

ఐశ్వర్యలక్ష్మి ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. బి. అజనీష్ లోక్‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.  జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.