SDT18 Budget: సాయిధరమ్ తేజ్తో ఇంత సాహసమా?..లెక్కలను మించిన బడ్జెట్తో హనుమాన్ ప్రొడ్యూసర్!

SDT18 Budget: సాయిధరమ్ తేజ్తో ఇంత సాహసమా?..లెక్కలను మించిన బడ్జెట్తో హనుమాన్ ప్రొడ్యూసర్!

రోడ్డు ప్రమాదంలో గాయపడి కొన్నాళ్లు సినిమాకు దూరమైన మెగా మేనళ్లుడు ,సుప్రీమ్ హీరో  సాయిధరమ్ తేజ్ గాయం నుంచి కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్లో పాల్గొంటున్నాడు.యాక్సిడెంట్తో సినిమాలకు కొంత గ్యాప్ రావడంతో.. సాయి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. 

గతేడాది ‘విరూపాక్ష’ చిత్రంతో హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా తన నెక్స్ట్ మూవీ సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయ్యాడు. రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. 

తాజా విషయానికి వస్తే..SDT18 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.ఇందుకోసం నిరంజన్ రెడ్డి వేసుకున్న లెక్కలు సినీ  ప్రముఖులను ఆశ్చర్యపరుస్తుంది.ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే హై బడ్జెట్ గా వస్తుంది.ఈ సినిమాకు గాను ప్రొడ్యూసర్ నిరంజన్ అక్షరాలా రూ.125 కోట్ల బడ్జెట్ ను కేటాయించాడట.

అయితే,ఇక్కడ షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే..సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అటు ఇటుగా చూసుకుంటే రూ.90 కోట్ల గ్రాస్.మరి ఇలాంటి హీరోకి హెవీ ఇంత బడ్జెట్ అంటే రిస్క్ అని..ఇండస్ట్రీ సర్కిల్స్ లో గుసగుసలు ఊపందుకున్నాయి.సరైన కథ పడితేనే రూ.100 కోట్ల కలెక్షన్స్ రావడం సాయి ధరమ్ కి రిస్క్ తో కూడుకున్న పని.ఇక అలాంటిది సాయి ధరమ్ తేజ్ మీద రూ.125 కోట్ల బడ్జెట్ అంటే..జాగ్రత్త సుమా!అంతేకాదు..ఈ సినిమాని డైరెక్ట్ చేసేది ఏదో స్టార్ డైరెక్టర్ అని కూడా కాదు..రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు నిరంజన్ రెడ్డి. 

అయితే, ఈ సినిమా బడ్జెట్ పై వస్తున్న భిన్న అభిప్రాయాల దృష్ట్యా..నిరంజన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించినట్టు సమాచారం.'తాను కథను మాత్రమే నమ్ముతానని..కథ డిమాండ్ మేరకు ఎంత ఖర్చైన పెట్టడానికి వెనుకాడనని హనుమాన్ మూవీ నిదర్శం.ఈ సినిమాని కూడా అలాగే నిర్మించానని..ఇక ఆ చిత్రం తన నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టిందని..సాయి ధరమ్ తో సినిమాను భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నాని ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి అన్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. 

SDT 18 స్టోరీ లైన్: (పోస్టర్ ను ఉద్దేశించి)

ల్యాండ్ మైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో చుట్టుముట్టబడిన ఎడారి..మధ్యలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.‘అతని రాక కోసం తహతహలాడుతున్న భూమి..నరకం లోతుల నుంచి పైకి’ అని పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్యాప్షన్ ఉండటంతో ఇదొక యూనివర్సల్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ అని తెలుస్తోంది. అలాగే దర్శక నిర్మాతలు చెప్పిన దాన్ని బట్టి..‘ఇదొక పీరియాడికల్ యాక్షన్ డ్రామా. సాయి తేజ్ క్యారెక్టర్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని తెలిపారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai DURGHA Tej (@jetpanja)