
యాక్టర్, డైరెక్టర్ నవీన్ విజయ్ కృష్ణ(Naveen Vijay Krishna) ది సోల్ అఫ్ సత్య(The Soul Of Satya)..అంటూ స్పెషల్ సాంగ్ ను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ లో హీరో సాయి ధరమ్(Sai Dharam Tej), హీరోయిన్ కలర్స్ స్వాతి(Colors Swathi) నటిస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ దేశం కోసం పోరాడే సైనికుడిగా, అతని వైఫ్ సత్యగా స్వాతి నటించింది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా సోల్ అఫ్ సత్య ఫుల్ సాంగ్ ను హీరో రామ్ చరణ్(Ram Charan) రిలీజ్ చేశారు.
ALSO READ :కులం అంటే చెప్పుతో కొడతా అన్నాను.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్
మహారాజు లాంటి అబ్బాయి తన జీవితంలో వస్తాడని కలలు కనే అమ్మాయి స్వాతికి..హీరో సాయి ధరమ్ తో పెళ్లవ్వతుంది. ఎన్నో జ్ఞాపకాలతో ముడి వేసుకున్న వీరీ పెళ్లి జీవితంలో..సరదాగా గడుపే రోజుల నుండి..ఒంటరిగా మిగిలే రోజులను చూపెట్టిన తీరు ఆకట్టుకుంటోంది. ఒక సైనికుడి భార్య అంతర్మథనాన్ని సోల్ ఆఫ్ సత్య సాంగ్ లో నవీన్ బాగా చూపించారు. ఆమె పడే ఆవేదన,ఆమె సంతోషం,ఆమె ఆనందం హార్ట్ టచ్ గా ఉంది. ఈ సాంగ్ లో ప్రేమ యొక్క త్యాగం, దేశం కోసం ప్రయాణం..నలిగే పోయే సైనిక జీవితాన్ని చాలా గొప్పగా చూపించారు డైరెక్టర్ విజయ్ కృష్ణ.
శృతి రజినీ(Sruthi Ranjani) రాసిన లిరిక్స్, మ్యూజిక్ చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. కలలు కన్న కనులే.. అలసి వాలి పోగా.. కలలు వీడి నిజమే నమ్మాలిగా..అంటూ సైనికుడు భార్య..తన మనసులో నలిగేపోయే ఆలోచనను గుర్తుకుచేసేలా లిరిక్స్ ఉన్నాయి. సాకేత్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ ను చూసిన ఆడియన్స్ షార్ట్ ఫిలిం కాకుండా..ఫుల్ మూవీ కావాలి అంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్స్ పెడుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ సాంగ్ ని నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా సాంగ్ రిలీజ్ అయ్యింది.
"Love's sacrifice, a hero's journey bestowed. Her silent strength, a nation's ode."
— Ram Charan (@AlwaysRamCharan) August 15, 2023
Happy to be launching #TheSoulOfSatya, an ode to the unsung warriors of our country.
Telugu: https://t.co/wNw85inuJ9
Hindi: https://t.co/bRvGzZV9NO
Tamil: https://t.co/9eqjDfwhrA…