పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు టీవీ, సినీ ఆర్టిస్టులు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా, తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పిఠాపురం బాట పట్టారు. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ బాబాయి కోసం ప్రచారం చేయగా, ఇప్పుడు మామయ్య కోసం ప్రచారం చేసేందుకు సాయి ధరమ్ తేజ్ సిద్దమయ్యాడు.

పిఠాపురంలో మూడురోజుల పర్యటించనున్న తేజ్, మచిలీపట్నం, పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేయనున్నారు.మే 4న మచిలీపట్నం, 5న పిఠాపురం, 6న కాకినాడలో తేజ్ ప్రచారం సాగనుంది. మచిలీపట్నంలో ఎంపీ అభ్యర్థి బాలశౌరి తరపున, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున, కాకినాడలో ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ తరపున ఎన్నికల ప్రచారం నిత్వహించనున్నారు తేజ్.