లైలా సినిమా టీమ్ ని విష్ చేసిన మెగా హీరో..

లైలా సినిమా టీమ్ ని విష్ చేసిన మెగా హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఈ నెల 14న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆకాంక్ష శర్మ నటించగా విశ్వక్ సేన్ కూడా లేడీ గెటప్ లో నటించాడు. నూతన దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ సినీ నిర్మాత సాహూ గారపాటి నిర్మించాడు. అయితే లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన సంఘటనలతో వివాదంగా మారింది. దీంతో కొందరు వైసీపీ ఫ్యాన్స్ లైలా సినిమాని బాయ్ కాట్ చెయ్యాలని ఏకంగా హ్యాష్ ట్యాగ్స్ ని కూడా ట్రెండ్ చేస్తున్నారు. 

Also Read :- రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో తెలుగు హీరో

ఇలాంటి సమయంలో టాలీవుడ్ మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ విశ్వక్ సేన్ లైలా సినిమాని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఇందులోభాగంగా "రేపు గ్రాండ్‌గా విడుదల కానున్న విశ్వక్ సేన్ లైలా బ్లాక్‌బస్టర్ విజయం కావాలని కోరుకుంటున్నాను. అలాగే లైలా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు" అంటూ ఎక్స్ లో పేర్కొన్నాడు. సాయి దుర్గ తేజ్ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా సరే తప్పకుండా హిట్ కావాలని కోరుకుంటూ ట్వీట్ చేస్తుంటాడు. దీంతో లైలా చిత్ర యూనిట్ థాంక్స్ తెలిపారు.