SYG - Carnage: సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు.. కార్నేజ్ వీడియోతో గూస్ బంప్స్

SYG - Carnage: సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు.. కార్నేజ్ వీడియోతో గూస్ బంప్స్

SYG - Carnage:  స్టార్ హీరో సాయి దుర్గ ప్రస్తుతం నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న SDT18 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ కి జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా జగపతిబాబు, సాయికుమార్, అనన్య నాగళ్ళ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. అయితే సాయి దుర్గ తేజ్ కెరీర్ ప్రారంభించి నేటితో 10 ఏళ్ళు పూర్తి కావడంతో గ్రాండ్ గ టీజర్, టైటిల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి SDT18 వివరాలు తెలియజేశారు.

ఇందులోభాగగంగా SDT18 సినిమా టైటిల్ "ఎస్వైజి సంబరాల ఏటిగట్టు" అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.  ఎస్వైజి కార్నేజ్ పేరుతో 2:32 నిమిషాల వీడియో ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయి దుర్గ తేజ్ యాక్టింగ్, విజువల్స్ గగుర్పుడిచేలా ఉన్నాయి. అయితే ఈ సినిమాకోసం సాయి దుర్గ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీ ని బిల్డ్ చేసుకున్నాడు. అలాగే రోహిత్ కేపీ స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంది. దీంతో సాయి దుర్గ తేజ్ మళ్ళీ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ | గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పుష్ప డైరెక్టర్..

ఈ విషయం ఇలా ఉండగా కార్నేజ్ లాంచ్ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అథితిగా వచ్చాడు. అలాగే సాయి దుర్గ తేజ్ కుటుంబ సభ్యులు, ఇప్పటివరకూ సాయి తేజ్ తో సినిమాలు చేసిన దర్శకులు వైవియస్ చౌదరి, దేవకట్టా, అనిల్ రావిపూడి, కిషోర్ తిరుమల, హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తదితరులు గెస్ట్స్ గా వచ్చారు.