థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్

థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్

సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో సాయి కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మసూద’. రాహుల్ యాదవ్ నిర్మించిన ఈ హారర్ డ్రామా శుక్రవారం విడుదలవుతోంది.  నిన్న చిత్ర యూనిట్‌‌తో పాటు  యంగ్ డైరెక్టర్స్‌‌ స్వరూప్, వెంకటేశ్ మహా, వివేక్ ఆత్రేయ, సందీప్ రాజ్,  వినోద్ అనంతోజు ప్రీమియర్ షో చూశారు.  ఒక ట్రూ హారర్ డ్రామాగా రూపొందిన ‘మసూద’  చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు.

హై టెక్నికల్‌‌ వాల్యూస్‌‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్‌‌‌‌లో చూస్తేనే మంచి ఎక్స్‌‌పీరియెన్స్ కలుగుతుందన్నారు. తమ చిన్నతనంలో చూసిన అమ్మోరు, దేవి చిత్రాలు ఏవిధంగా అయితే ప్రేక్షకుల్ని అలరించాయో,  అంతే జెన్యూన్ గా ‘మసూద’ మెప్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ ‘క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామనుకున్న నాకు.. హీరో పాత్ర వచ్చినందుకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి రోల్ రావడం చాలా ఆనందంగా ఉంది’ అన్నాడు. ఇంతమంది దర్శకులు మా సినిమా గురించి గొప్పగా చెప్పడం హ్యాపీ అంది కావ్య. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉందని చెప్పింది భార్గవి శ్రీధర్. టెర్రిఫిక్ ఎక్స్‌‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడాలన్నారు నిర్మాత. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి, ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి పాల్గొన్నారు.