నేను దేశంలోనే అత్యుత్తమ స్పిన్నర్.. భారత జట్టులోకి తీసుకోండి: యువ క్రికెటర్ డిమాండ్

నేను దేశంలోనే అత్యుత్తమ స్పిన్నర్.. భారత జట్టులోకి తీసుకోండి: యువ క్రికెటర్ డిమాండ్

టీంఇండియాలో చోటు దక్కించుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా స్పిన్ విభాగంలో చాలా కష్టం. స్పిన్నర్లు ఎక్కువగా ఉండే మన దేశంలో ఎంతో అనుభవమున్న యుజ్వేంద్ర చాహల్ కు సైతం జట్టులో స్థానం దక్కడం లేదు. ఇదంతా తనకు సంబంధం లేదంటూ తమిళ నాడు స్పిన్నర్..  ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఆడుతున్న సాయి కిషోర్ తనను భారత టెస్ట్ జట్టులో సెలక్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. 

దులీప్ ట్రోఫీకి ముందు  సాయి కిషోర్ సెలక్టర్లు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. "నేను దేశంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడినని భావిస్తున్నాను. నన్ను టెస్ట్ మ్యాచ్‌లకు సెలక్ట్ చేస్తే నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పని లేదు. జడేజాతో కలిసి దులీప్ ట్రోఫీ ఆడబోతున్నాను. అతని అనుభవం నాకు కలిసి వస్తుంది". అని ఈ యువ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి స్టార్ స్పిన్నర్లున్నారు. వీరిని పక్కన పెట్టి సాయి కిషోర్ కు భారత టెస్ట్ జట్టులో అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. 

సాయి కిషోర్ తన స్పిన్ తో పాతూరి బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపించగలడు. ఆల్ రౌండర్ గా ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున 19.57 సగటుతో 5 మ్యాచ్‌లలో 7 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత తమిళ నాడు ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టిన ఈ యువ స్పిన్నర్.. ప్రస్తుతం బుచ్చి బాబు టోర్నీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీ ముగియగానే దులీప్ ట్రోఫీతో బిజీ కానున్నాడు.