
రవిశ్రీనివాసన్ సాయి కిషోర్.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో 6 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ 2025 సీజన్ ను గ్రాండ్ గా ఆరంభించాడు. బ్యాటింగ్ పిచ్ లపై రవి కిషోర్ బౌలింగ్ చేస్తున్న తీరు అద్భుతం. గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న ఈ 28 ఏళ్ళ స్పిన్నర్ మూడు మ్యాచ్ ల్లో కట్టుదిట్టమైన బౌలింగ్ లో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. సహచరుడు రషీద్ ఖాన్ భారీగా పరుగులిస్తున్నా.. ఈ తమిళ నాడు స్పిన్నర్ మాత్రం తన వేరియేషన్ తో ఆకట్టుకుంటున్నాడు.
బుధవారం (ఏప్రిల్ 2) రాయల్ ఛాలెంజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో 4 ఓవర్లలో 22 పరుగులు చేసి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ తర్వాత సాయి కిషోర్ చెప్పిన ఒక స్టేట్ మెంట్ వైరల్ అవుతుంది. 2024 దులీప్ ట్రోఫీకి ముందు సాయి కిషోర్.. సెలక్టర్లు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. "నేను దేశంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడినని భావిస్తున్నాను. నన్ను టెస్ట్ మ్యాచ్‌లకు సెలక్ట్ చేస్తే నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పని లేదు." అని ఈ యువ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉన్న పిచ్ లపై సాయి కిషోర్ బౌలింగ్ చేస్తున్న తీరు అద్భుతం. అతను గత సంవత్సరంలో ఇచ్చిన స్టేట్ మెంట్ కు న్యాయం చేశాడనిపిస్తుంది. గత సీజన్ లో కూడా గుజరాత్ జట్టుతోనే ఉన్న సాయి కిషోర్ 19.57 సగటుతో 5 మ్యాచ్‌లలో 7 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. ఇదంతా పక్కన పెడితే టీమిండియాలో చోటు దక్కించుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా స్పిన్ విభాగంలో చాలా కష్టం. స్పిన్నర్లు ఎక్కువగా ఉండే మన దేశంలో ఎంతో అనుభవమున్న యుజ్వేంద్ర చాహల్ కు సైతం జట్టులో స్థానం దక్కడం లేదు. ఐపీఎల్ తర్వాత సాయి కిషోర్ ను సెలక్టర్లు ఏమైనా పరిగణిస్తారేమో చూడాలి.
Sai Kishore has been very impressive in IPL 2025 So Far! 🤩#IPL2025 #RCBvGT pic.twitter.com/toilk8Kww2
— Surya Pratap (@SuryaPr67395216) April 2, 2025