వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్ వనస్థలిపురం హుడా సాయినగర్ కాలనీలోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు  కూల్చివేశారు.  రోడ్ నంబర్ 5 లో రోడ్డు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను  కూల్చేశారు అధికారులు . రోడ్డు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని  గత కొంత కాలం నుంచి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో   రోడ్డు కబ్జా చేసి చేపట్టిన  నిర్మాణాలను  హైకోర్టు  ఆర్డర్ రావడంతో అధికారులు కూల్చివేశారు.  

ALSO READ | సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌పై కంప్లయింట్స్.. డబ్బులు ఇవ్వటం లేదని బాధితుల ఆందోళన

అయితే జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై  హుడా సాయినగర్ కాలనీ వాసులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారులు కబ్జాకు గురైన పూర్తి నిర్మాణాలను కూల్చివేయకుండా నామమాత్రంగా కూల్చివేశారని ఆరోపించారు. కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను  పూర్తి స్థాయిలో కూల్చివేయాలని డిమాండ్ చేశారు కాలనీ వాసులు.