నాగ చైతన్య (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ తండేల్ (Thandel). అల్లు అరవింద్ సమర్పణలో భారీ బడ్జెతో నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తండేల్ నుంచి రెండో పాట విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. శివ శక్తి అంటూ రానున్న ఈ సాంగ్ డిసెంబర్ 22 న రిలీజ్ చేస్తునట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాక ఈ సాంగ్ కాశీలో లాంచ్ చేస్తామని పోస్టర్ లో వెల్లడించారు.
ఈ మేరకు చై, సాయి పల్లవిల ఫొటోస్ షేర్ చేశారు. చాలా రోజుల నుంచి సాయి పల్లవి డాన్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ పాట కన్నుల పండుగ అవ్వనుందని టాక్. ఇప్పటికే తండేల్ నుంచి రిలీజైన బుజ్జి తల్లి సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
A song to celebrate the purest form of LOVE between the ETERNAL COUPLE #Shivashakti - that stood the test of time in every YUGA ✨#Thandel second single #ShivaShakti out on 22nd Dec in Telugu, Hindi & Tamil 👁️
— Geetha Arts (@GeethaArts) December 18, 2024
Grand Launch at the Divine Ghats of Kashi 🔱
A 'Rockstar'… pic.twitter.com/Y0Phu0tzXQ
ఇక ఇపుడు రానున్న రెండో సింగిల్ శివ-పార్వతులకు సంగీత విందు కానుందని తెలుస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ బీట్స్ నుండి చై, సాయి పల్లవి చేసే నాట్యం మరింత ప్రత్యేకంగా ఉంటుందనే విషయం పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన చై-సాయి పల్లవిల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
A musical treat for the Shiva-Parvati ✨
— Geetha Arts (@GeethaArts) September 30, 2024
This splendid song from #Thandel will be remembered for long ❤🔥
From the beats of Rockstar @ThisIsDSP to the visual of stellar dance by Yuvasamrat @chay_akkineni & @Sai_Pallavi92, this song will be special for every reason 💥💥
Get… pic.twitter.com/QcO1FkXQN1