తమిళ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్ మరియు సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని కార్గిల్ వార్ లో మరణించిన మేజర్ ముకుంద్ జీవితం ఆధారంగా తమిళ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించాడు. ప్రముఖ హీరో మరియు ప్రొడ్యూసర్ కమల్ హాసన్ నిర్మించాడు. సాయి పల్లవి, శివ కార్తికేయన్ ల యాక్టింగ్, డైరెక్టర్ రాజ్ కుమార్ టేకింగ్ వంటివాటితో అమరన్ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో భారీగా కలెక్షన్లు రాబడుతోంది.
అమరన్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు.
అమరన్ రిలీజ్ అయిన ఫస్ట్ డే శుక్రవారం రూ.21.25 కోట్లు(నెట్) కలెక్ట్ చేసింది. ట్రేడ్ ట్రాకర్ ప్రకారం అమరన్ తమిళనాడులో రూ.15 కోట్ల (గ్రాస్) సంపాదించింది. ఈ ఏడాది దళపతి విజయ్ నటించిన గోట్ మరియు రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రాలు మాత్రమే రూ.15 కోట్లు వసూళ్లను సాధించాయి. దీంతో హీరో శివ కార్తికేయన్ కేరీర్ లోనే మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా అమరన్ నిలిచింది.
అయితే మంచి మౌత్ టాక్ పబ్లిసిటీ ఉండటం, లాంగ్ వీకెండ్ వంటివాటి కారణంగా ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మొదటివారంలోనే అమరన్ రూ.100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Bringing True Heroism to the Big Screen, #Amaran Sees Massive Collections Across the Globe! #StrongerTogether#Amaran #MajorMukundVaradarajan#KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy
— Raaj Kamal Films International (@RKFI) November 1, 2024
A Film By @Rajkumar_KP @ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran… pic.twitter.com/dTtrqJlQa9