తమిళ స్టార్ శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) హీరోగా వస్తన్న లేటెస్ట్ మూవీ అమరన్ (Amaran). మేజర్ ముకుంద్ వరదరాజన్ (Mukund Varadharajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periyaswami) తెరకెక్కిస్తున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్ (Kalam Haasan) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ ఆడియన్స్ పై అంచనాలు పెంచేసింది.
ఇదిలా ఉంటే..తాజాగా అమరన్ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానున్నట్లు (జూలై 17) మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ దీపావళి పండుగకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఒకేసారి విడుదల కానుంది. రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని రచయితలు శివ్ అరూర్,రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పుస్తకంలోని ఓ చాప్టర్ ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ రూపొందిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ALSO READ | Indian 2 Runtime: శంకర్ టీమ్ కీలక నిర్ణయం..12 నిమిషాలు తగ్గిన ఇండియన్ 2 రన్‌టైమ్..
ఈ సినిమాకు ఓటీటీలో అదిరిపోయే డీల్ కుదిరిందట. అమరన్ సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ పోటీపడగా అదిరిపోయే రేట్ కు నెట్ఫ్లిక్ అమరన్ హక్కులను సొంతం చేసుకుందట. ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్ ఏకంగా రూ.55 కోట్లు ఖర్చు చేసిందని సమాచారం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. అటు శివ కార్తికేయ, ఇటు సాయి పల్లవి కెరీర్ లో ఇదే హైయెస్ట్ అమౌంట్.
This Diwali🔥 #Amaran #AmaranDiwali#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy
— Raaj Kamal Films International (@RKFI) July 17, 2024
A Film by @Rajkumar_KP
@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran pic.twitter.com/u6A1GI4x3e
లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి సినిమాల నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. 2022లో వచ్చిన గార్గి తర్వాత ఆమె నటించిన ఏ చిత్రం కూడా రిలీజ్ కాలేదు. అయితే ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాలు చేస్తున్నారు. సాయిపల్లవి లైనప్‍లో నాలుగు చిత్రాలు ఉన్నాయి. అయితే, సాయిపల్లవిని మళ్లీ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో అమరన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.