Sai Pallavi Dance: సోదరుడి పెళ్లిలో సాయి పల్లవి ట్రెడిషనల్ స్టెప్పులకి ఫ్యాన్స్ ఫిదా.. వీడియోస్ వైరల్

Sai Pallavi Dance: సోదరుడి పెళ్లిలో సాయి పల్లవి ట్రెడిషనల్ స్టెప్పులకి ఫ్యాన్స్ ఫిదా.. వీడియోస్ వైరల్

సహజ నటి సాయి పల్లవి (Sai Pallavi)క్రేజే వేరు. అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసే డ్యాన్సింగ్ క్వీన్. యాక్టింగ్లో తనకుంటూ ఓ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకుని..సక్సెస్కు కేరాఫ్ అడ్రస్గా మలుచుకుని దూసుకెళ్తోంది.

ఇదిలా ఉంచితే..ప్రస్తుతం సాయి పల్లవి తన కజిన్ బ్రదర్ జిత్తు పెళ్ళిలో సందడి చేసింది. ఈ పెళ్లి వేడుకలో సాయిపల్లవి తనదైన డ్యాన్స్తో ఆకట్టుకుంది. సాయిపల్లవి తన బంధువులతో కలిసి మలయాళ సాంప్రదాయమైన పాటలకు వేసిన స్టెప్పులు బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నీలం రంగు చీరలో ఆమె డ్యాన్స్‌ చేస్తూ నెటిజన్స్తో పాటు తమ ఫ్యాన్స్ను అలరించింది. దాంతో సాయి పల్లవి డ్యాన్స్‌కు మరోసారి ఫిదా అయ్యామని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, ఈ పెళ్లి వేడుక ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే సమాచారం మాత్రం బయటకి రాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే, రీసెంట్గా సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ పెళ్ళిలో సైతం తన డ్యాన్స్ తో దుమ్మురేపిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

ఇటీవలే తండేల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన నటనతో, డ్యాన్స్ స్టెప్పులతో మరింత దగ్గరైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకి పైగా వసూళ్లు చేయడంతో రెమ్యూనరేషన్ సైతం భారీగా పెంచేసిందని టాక్. అమరన్‌ సినిమా కోసం రూ.3 కోట్ల వరకు తీసుకున్న సాయి పల్లవి.. తండేల్ కోసం ఏకంగా రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందట. ఈ మూవీ కూడా హిట్ అవ్వడంతో 5 నుంచి రూ. 8కోట్లు తీసుకుంటుందని టాక్.