లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రేమమ్(Premam) సినిమాతో నటిగా ప్రయాణం మొదలెపట్టిన ఆమె ఫిదా(Fida) సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. నిజానికి సాయి పల్లవిని సినిమాల్లో కన్నా వ్యక్తిగతంగా ఇష్టపడేవారే ఎక్కువ. కారణం.. ఆమె చాలా సహజంగా ఉండటానికి ఇష్టపడతారు. రెమ్యునరేషన్ ను బట్టి కాకుండా కేవలం పాత్రను బట్టి ఆమె సినిమాలను సెలెక్ట్ చేసుకుంటారు. సినిమాల్లో గానీ, ఫంక్షన్స్ కి గానీ సారీ, చుడీదార్స్ తో ఎక్కువగా కనిపిస్తారు. గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటారు. అందుకే ఆమెను చాలా ఇష్టపడతారు.
అయితే.. సాయి పల్లవిలో ప్రేక్షకులకు ఏది బాగా నచ్చిందో ఆ రూల్ నే బ్రేక్ చేయనున్నారట సాయి పల్లవి. అదేంటంటే.. కెరీర్ లో ఫస్ట్ టైం రొమాంటింక్ సాంగ్ లో నటించనున్నారట. ఇప్పటివరకు గ్లామర్ అండ్ రొమాంటిక్ సెన్స్ కు దూరంగా ఉంటూ వస్తున్న సాయి పల్లవి మొదటిసారి అలాంటి సన్నివేశాల్లో నటించనున్నారట. తమిళ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా అమరన్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాను రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ భార్యగా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నారు సాయి పల్లవి. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ సాంగ్ ఉందట. ఆ షూట్ త్వరలోనే మొదలుకానుందని సమాచారం.
ఇలా కెరీర్ లో ఫస్ట్ టైమ్ సాయి పల్లవి రొమాంటిక్ సాంగ్ కనిపిస్తుండటంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అమరన్ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి కెరీర్ లో ఫస్ట్ టైం రొమాంటిక్ సీన్స్ లో కనిపించబోతున్న సాయి పల్లవిని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.