
సౌత్ టాప్ హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరిగా ఉంటుంది. కథతో పాటు పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తుంటుంది. తన క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయినా నిర్మోహమాటంగా చేయనని చెప్పే స్వభావం తనది. అలా నటిగా అన్ని జాగ్రత్తలు తీసుకునే సాయి పల్లవికి ఓ కల ఉందట.
నేషనల్ అవార్డు అందుకోవడమే తన కల అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ల అమ్మ తనకో చీర ఇచ్చిందట. సాయి పల్లవి పెళ్లి రోజున అది కట్టుకోవాలని చెప్పారట. అయితే తనకింకా పెళ్లి కాలేదు కాబట్టి.. జాతీయ అవార్డు అందుకొనేటప్పుడు అమ్మ ఇచ్చిన చీర కట్టుకొని ఆ వేడుకకు హాజరవుతానని ఆరోజే మాట ఇచ్చిందట సాయి పల్లవి.
ఆ రోజు కోసమే తాను ఎదురుచూస్తున్నా అని చెప్పింది. ఆమె నటించిన ‘గార్గి’ చిత్రానికి జాతీయ అవార్డు వస్తుందని కొందరు భావించారు. కానీ అది జరగలేదు. రీసెంట్‌గా వచ్చిన అమరన్, తండేల్ చిత్రాల్లో తనదైన నటనతో సాయి పల్లవి ఆకట్టుకుంది. ఈసారైనా తనకు నేషనల్ అవార్డు వస్తుందేమో చూడాలి.