Sai Pallavi: మనసుని హత్తుకునేలా సాయి పల్లవి, శివ కార్తికేయన్ ఎమోషనల్ జర్నీ.. వీడియో చూశారా!

Sai Pallavi: మనసుని హత్తుకునేలా సాయి పల్లవి, శివ కార్తికేయన్ ఎమోషనల్ జర్నీ.. వీడియో చూశారా!

తమిళ స్టార్ శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) హీరోగా వస్తన్న లేటెస్ట్ మూవీ అమరన్ (Amaran). మేజర్ ముకుంద్ వరదరాజన్ (Mukund Varadharajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periyaswami) తెరకెక్కిస్తున్నాడు.

లోకనాయకుడు కమల్ హాసన్ (Kalam Haasan) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ ఆడియన్స్ పై అంచనాలు పెంచేసింది. 

అమరన్ సినిమాలో 'ఇందు రెబెక్కా వర్గీస్‌గా' సాయి పల్లవిని పరిచయం చేస్తూ మేకర్స్ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు. ఈ మూవీలో మేజర్ ముకుంద్ జీవితంలో అనేక సందర్భాలు ఉండబోతున్నాయని విజవల్స్ చూస్తే అర్ధమవుతోంది. 1:22 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో శివకార్తికేయన్ భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుపుతూ ఉన్న వీడియో ఆకట్టుకుంటోంది.

అంతేకాకుండా ఈ ఇంట్రో వీడియో చూస్తే.. ముకుంద్, ఇందులో ఎమోషనల్ జర్నీని ఎలా ప్రజెంట్ చేస్తోందో చెబుతుంది. రిపబ్లిక్ డే పరేడ్ సీక్వెన్స్‌తో ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వంటి ప్రముఖ వ్యక్తులతో పాటు ముకుంద్‌ను సత్కరిస్తున్న రియల్ ఫుటేజీని ప్రజెంట్ చేయడం మనసుని హత్తుకుంది.

ALSO READ | రియల్ లైఫ్ పాత్రలో సాయిపల్లవి

ఈ సినిమాతో మరోసారి సాయి పల్లవి లుక్స్, యాక్టింగ్కి అడియన్స్ ఫిదా అవ్వడం పక్కా అనేలా ఉన్నాయి. ప్రస్తుతం అమరన్ లో శివ కార్తికేయన్ తో దిగిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఈ ఇంట్రో వీడియోలో బీజీఎమ్ చాలా బాగుంది. ఫస్ట్ లుక్ మొత్తం చాలా ఆహ్లాదకరంగా, మనసుకు హత్తుకునేలా ఉంది. 

తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఒకేసారి విడుదల కానుంది. రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని రచయితలు శివ్ అరూర్,రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పుస్తకంలోని ఓ చాప్టర్ ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ రూపొందిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి సినిమాల నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. 2022లో వచ్చిన గార్గి తర్వాత ఆమె నటించిన ఏ చిత్రం కూడా రిలీజ్ కాలేదు. అయితే ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాలు చేస్తున్నారు. సాయిపల్లవి లైనప్‍లో నాలుగు చిత్రాలు ఉన్నాయి. అయితే, సాయిపల్లవిని మళ్లీ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వేచిచూస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.