Vijay, Sai Pallavi తెరపై మునుపెన్నడూ చూడని ప్రేమకథ.. విజయ్కి జంటగా సాయి పల్లవి

Vijay, Sai Pallavi  తెరపై మునుపెన్నడూ చూడని ప్రేమకథ.. విజయ్కి జంటగా సాయి పల్లవి

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) కెరీర్ ఎన్నడూ లేనంతగా బిజీగా ఉన్నారు. ది ఫ్యామిలీ స్టార్(The Family star) పరాజయం తరువాత వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. అందులో ఒకటి దర్శకుడు రవికిరణ్ కోలాతో చేస్తున్న మూవీ. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్టు కు సంబందించిన అధికారిక ప్రకటన ఇస్తూ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. చాలా ఇంటెన్స్ గా ఉన్న ఈ పోస్టర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు.. సినిమాపై అంచనాలను పెంచేసింది. 

అయితే. తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి నటించనున్నారట. ఎనబైదశకంలోని ఇంటెన్స్ కథతో వస్తున్న ఈ సినిమా పాయింట్ సాయి పల్లవికి బాగా నచ్చిందట. తెలుగు తెరపై ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రేమకథతో వస్తున్న ఈ సినిమాను ఆమె ఇటీవలే ఒకే చేసిందని సమాచారం. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. 

ఈ లేటెస్ట్ న్యూస్ తో విజయ్ దేవరకొండ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరోపక్క సాయి పల్లవి కూడా ఒక సినిమాను ఒకే చేశారు అంటే ఈ సినిమాలో కచ్చితంగా మ్యాటర్ ఉంటుంది అనే ప్రేక్షకుల నమ్మకం. అది ఈ సినిమా విషయంలో కూడా నిజం అవుతుందని, ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు విజయ్ ఫాన్స్.