అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇటీవలే రిలీజైన మూడు సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకెళ్తోన్నాయి. 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో ఆడియన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి డబ్బింగ్ చెప్తున్న వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నటి సాయిపల్లవి సరదా మాస్ ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ చందూ మొండేటిని సాయిపల్లవి ర్యాగింగ్ చేస్తున్నట్లు కనిపించింది. 'ఏంటి.. ఇప్పుడు చందూ గారు కూర్చున్నారని రియాక్షన్స్ ఇస్తున్నారా.. ? ఇదో ఒక్కరోజు' అని సాయిపల్లవి అనగానే.. చందూ.. 'అయ్యో లేదు.. ఒట్టు' అని డబ్బింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. ఆ తర్వాత వీరి మధ్య జరిగిన సరదా సంభాషణ భలే ఉంది.
సాయి పల్లవి మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే నేను ఒక పది రోజుల నుంచి డబ్ చేస్తున్నాను. ఒక్క దోమ లేదు.. ఒక కెమెరా లేదు. ఈ రోజు ఏంటి కెమెరాలు పెట్టి.. ఇన్నిరోజులు ఫీవర్ తో.. కోల్డ్ తో డబ్ చేస్తున్నాను.. ఇప్పటివరకు ఒక్క కెమెరా కూడా నా వైపు తిరగలేదు. ఈ రోజు మీరొచ్చారని కెమెరాలు అన్ని నా వైపు తిప్పారు. అబ్బా.. నా లక్ ఈ రోజు.. ఆయన వచ్చారు. నేను డబ్బింగ్ చేసింది ఎవరో ఒకరు కవర్ చేశారని' మాట్లాడింది.
Also Read : సింగర్ రామ్ మిరియాల పాడిన లేటెస్ట్ విలేజ్ సాంగ్ విన్నారా
దీంతో చందూ మొండేటి రియాక్ట్ అవుతూ.. "ఇది.. ఇలా ఉంటుందండి మా ర్యాగింగ్.. ఇన్నేసి అవార్డులు.. రివార్డులు తీసుకున్నవారితో వర్క్ చేయడం చాలా కష్టం" అని దండం పెట్టేసి వెళ్ళిపోయాడు చందూ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.