Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ అక్కడికన్నా తెలుగులోనే ఎక్కువ పేరుతెచ్చుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఆమె దూరం. అందుకే సెలక్టెడ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది సాయి పల్లవి. స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకున్నా ఆమె చాలా సింపుల్ గా ఉంటారు. గ్లామర్ షోకి ఇష్టపడరు అందుకే సాయి పల్లవి అంటే చాలా మంది ఇష్టపడతారు.

నిజానికి.. సాయి పల్లవి హీరోయిన్ కాక ముందు తెలుగు ఢీ షోలో డాన్సర్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. 2013లో ప్రసారమైన ఈ డాన్స్ లో ఆమె విన్నర్ గా నిలిచారు. అయితే తాజాగా ఆమెకు సంబందించిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవును.. సౌత్ స్టార్ అనుష్క హీరోయిన్ గా వచ్చిన అరుంధతి సినిమా ఎంత పెద్ద విజయాన్నీ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ఘం.. ఘం.. అనే పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. చేతిలో పొడవైన రెండు ఎరుపు రంగు బట్టలను పట్టుకొని అనుష్క చేసే డాన్స్ సినిమాకె హైలెట్ గా నిలిచింది. 

ఆ పాటను సాయి పల్లవి ఢీ షో పర్ఫామ్ చేశారు. ఎవరు షేర్ చేశారో తెలియదు కానీ, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒరిజినల్ సాంగ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా సాయి పల్లవి చేసిన ఈ డాన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. నిజానికి.. ఈ పాటను స్టేజిపై పెర్ఫార్మ్ చేయడం చాలా కష్టం. కానీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా అలవోకగా చేసేసింది సాయి పల్లవి. తన పవర్ఫుల్  డాన్స్ కి జెడ్జిస్ సైతం అవాక్కయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీలుంటే మీరు కూడా ఓ లుక్కేయండి.