ఆర్మీ ఆఫీసర్ భార్యగా సాయి పల్లవి..

ఆర్మీ ఆఫీసర్ భార్యగా సాయి పల్లవి..

తమిళ్ ప్రముఖ హీరో శివకార్తికేయన్ ఎప్పుడూ విభిన్న కథనాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. కాగా ప్రస్తుతం తమిళ్ లో అమరన్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దివంగత ఆర్మీ లెఫ్టనెంట్ ముకుంద్ వరదరాజన్ జీవితగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో అమరన్ చిత్రంలో శివకార్తికేయన్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫిసర్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఇప్పటికే శివకార్తికేయన్ పాత్రకి సంబంధించిన పలు గ్లింప్స్ విడుదల కాగా మంచి రెస్పాన్న్ వచ్చింది. 

అయితే ఈ చిత్రానికి ప్రముఖ తమిళ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరిసామి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ హీరో కమల్ హాసన్ మరియు సినీ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్  డైరెక్టర్ జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

ALSO READ | JigraTrailer: తమ్ముడి కోసం అక్క పోరాటం...స్టన్నింగ్ యాక్షన్‌తో అలియా భ‌‌‌‌‌‌‌‌ట్ జిగ్రా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఈ చిత్రంలో ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించిన సాయి పల్లవికి సంబంధించిన ఇంట్రో వీడియో ని చిత్ర యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ ఇంట్రోలో నటి సాయి పల్లవి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అలాగే ఇన్నోసెంట్ ఇల్లాలిగా కనిపిస్తూ చివర్లో తన భర్త మరణాంతరం రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్ చక్ర అవార్డు అందుకుంటున్న సన్నివేశాలు ప్రోమోకి హైలెట్ గా నిలిచాయి.

ఈ విషయం ఇలా ఉండగా అమరన్ చిత్రం తమిళ్ తోపాటు తెలుగు, హిందీ, మలయాళం తదితర భాషలలో అక్టోబర్ 31 న దీపావళి పండుగ కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.