అమరన్ ట్రైలర్ రిలీజ్.. ఆర్మీ అంటే జాబ్ కాదు.. ఇట్స్ ఎ లైఫ్..

అమరన్ ట్రైలర్ రిలీజ్.. ఆర్మీ అంటే జాబ్ కాదు.. ఇట్స్ ఎ లైఫ్..

తమిళ్ ప్రముఖ హీరో శివకార్తికేయన్, బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఈ చిత్రాన్ని దివంగత ఆర్మీ లెఫ్టనెంట్ ముకుంద్ వరదరాజన్ జీవితగాథ ఆధారంగా  తమిళ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరిసామి తెరకెక్కించారు.

ప్రముఖ హీరో కమల్ హాసన్ మరియు సినీ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇక అమరన్ చిత్రంలో శివకార్తికేయన్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫిసర్ పాత్రలో కనిపించనున్నాడు. సాయి పల్లవి ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించింది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ALSO READ | SSMB29: అడవిలో అడుగుపెట్టిన జక్కన్న.. తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఫారెస్ట్ వీడియో షేర్

హీరో శివకార్తికేయన్ తన కూతురితో ఆడుకుంటున్న సన్నివేశాలతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నింగి ఆకాశం మధ్యన ఉండే దూరమే మన ఇద్దరి ప్రేమ అంటూ సాయి పల్లవి చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇక ఆర్మీ ఆపరేషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలతో అలరించాడు శివకార్తికేయన్. ఈ క్రమంలో ఆర్మీ అంటే జాబ్ కాదు ఇట్స్ ఎ లైఫ్ అంటూ చెప్పే డైలాగులు ఆడియన్స్ కట్టి పడేశాయని చెప్పవచ్చు.

మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ బీజీఎంతో తన మార్క్ ని అందుకున్నారు. ఓవరాల్ గా దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కట్ చేసిన ట్రైలర్ అమరన్ సినిమాపై ఆసక్తిని పెంచిందని చెప్పవచ్చు.

ఈ విషయం ఇలా ఉండగా అమరన్ చిత్రం తమిళ్ తోపాటు తెలుగు, హిందీ, మలయాళం తదితర భాషలలో అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ తో ఆకట్టుకున్న శివకార్తికేయన్ థియేటర్లలో ఆడియన్స్ ని ఏ విధంగా అలరిస్తాడో చూడాలి.