
సాయిపల్లివి. సహజ నటి. రెండు రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. సాయి పల్లవికి పెళ్లి అయ్యిందని.. అవునా అని ఆశ్చర్యపోయేలోపు పెళ్లి ఫొటోలు ఇదిగో అంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన ఎవరికైనా.. నిజంగానే సాయి పల్లవి పెళ్లి చేసుకున్నది అని కన్ఫామ్ అవుతారు.. నిజం ఏంటంటే.. సాయి పల్లవి పెళ్లి చేసుకోలేదు.. ఈ ఫొటోల వెనక నిజం ఏంటీ.. వాస్తవం ఏంటీ.. సోషల్ మీడియా ఎలా దాన్ని మార్చింది అనేది తెలుసుకుందాం..
Finally She got Married ❤️
— The K B (@KiranBunny28) September 20, 2023
And She Prove That Love Has No Colour..Hats off Sai Pallavi#marriage #saipallavi pic.twitter.com/HHIuTUdzmB
సాయి పల్లవి లేటెస్టుగా తమిళ యాక్టర్ శివ కార్తికేయన్ (SK21) కొత్త మూవీలో నటిస్తుంది. ఆ సినిమా ప్రారంభోత్సవంలో.. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో కలిసి పూజలో పాల్గొన్నది సాయి పల్లివి. ఆ సందర్భంగా పూజారులు వాళ్లకు దండలు వేసి.. క్లాప్ కొట్టటంతోపాటు.. స్క్రిప్ట్ బుక్ అందించారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఫొటోలు తీసింది. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దర్శకుడు రాజ్ కుమార్ పరియసామి తన ఎక్స్ అకౌంట్ నుంచి ఈ ఫొటోలు బయటకు వచ్చాయి.
Happy birthday dear @Sai_Pallavi92
— Rajkumar Periasamy (@Rajkumar_KP) May 9, 2023
You are the best and May God bless you with everything that’s best as always! I feel blessed to have you too by my side in this! Thank you for being there! #HappyBirthdaySaiPallavi pic.twitter.com/XTn2980ZjQ
ఇక్కడే సోషల్ మీడియా వాళ్లు తమ టాలెంట్ చూపించేశారు. సాయి పల్లివి.. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఉన్న దండలతో.. పక్కపక్కనే ఉన్న ఫొటోను.. కట్ చేశారు. ఫుల్ ఫొటోను.. హాఫ్ చేశారు. వాటిని రీ పోస్టు చేస్తూ.. సాయి పల్లవి పెళ్లి అయిపోయింది.. వరుడు ఇతనే.. లవ్ మ్యారేజ్ అంటూ హోరెత్తించారు. దీంతో సినీ ఇండస్ట్రీతోపాటు.. అభిమానుల్లో ఆతృత, ఆరా పెరిగింది.
ALSO READ : కెనడియన్లకు వీసా సేవలపై భారత్ కీలక నిర్ణయం
అసలు ఫొటోను.. సగానికి కట్ చేయటం వల్ల వచ్చిన తిప్పలు, అనుమానాలు ఇవి అంటూ ఇప్పుడు సాయి పల్లవి ఆప్తులు అసలు ఫొటోలను షేర్ చేయటంతో.. నిజం ఏంటో సినీ ప్రపంచానికి తెలిసింది. మొత్తానికి సాయి పల్లవి పెళ్లి అనేది ఫేక్.. అసలు నిజం ఇదీ..