భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం(Ramayanam) గాధ ఆధారంగా హిందీలో మరో చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి(Nihish thiwari) దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్(Allu aravind), మధు మంతెన(Madhu mantena) భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.
ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఈ సినిమాలో రాముడిగా రణబీర్‌కపూర్ కనిపించనున్నాడు. అయితే సీత పాత్రకు సంబంధించి రోజుకో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ముందుగా ఈ సినిమాలో సీత పాత్ర కోసం బాలీవడ్ బ్యూటీ అలియాభట్ ను అనుకున్నారు మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుండి అలియాభట్ తప్పుకుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటె తాజా సంచారం మేరకు ఈ పాత్ర కోసం మళయాళ బ్యూటీ సాయి పల్లవిను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. ఈ సినిమా కోసం సాయి పల్లవి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందని, త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉండనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. తెలుగు నాగచైతన్య హీరోగా వచ్చిన లవ్ స్టోరీ సినిమా తరువాత ఇప్పటివరకు ఆమె ఒక్క సినిమాను కూడా ఒకే చేయలేదు. కొంత కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. దానిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి పాన్ ఇండియా లెవల్లో భారీగా రానున్న రామాయణం ప్రాజెక్టుకైనా ఒకే చెప్తుందా అనేది చూడాలి.