ZIM vs IND 2024: జింబాబ్వే సిరీస్‌కు సాయి సుదర్శన్, జితేష్, రాణా.. కారణం ఏంటంటే..?

ZIM vs IND 2024: జింబాబ్వే సిరీస్‌కు సాయి సుదర్శన్, జితేష్, రాణా.. కారణం ఏంటంటే..?

జింబాబ్వేతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కు 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జట్టులో స్వల్ప మార్పులు చేశారు. మొదటి రెండు టీ20ల కోసం జింబాబ్వే వెళ్లేందుకు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ల స్థానంలో ఈ ముగ్గురిని ఎంపిక చేశారు.

శనివారం (జూన్ 29) టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో శాంసన్, దూబే, జైస్వాల్ ఉన్నారు. హరికేన్ కారణంగా వీరియూ బార్బడోస్ లోనే ఉన్నారు. వీరు ఇండియా చేరుకోవడం ఆలస్యం అవుతుంది. శనివారం (జూలై 6) నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో వీరు ఇండియా వచ్చి జింబాబ్వే పర్యటించేసరికీ ఆలస్యం అవుతుంది. ఈ కారణంగానే వీరి స్థానాల్లో తొలి రెండు టీ20 లకు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలను ఎంపిక చేశారు.    

టీమిండియా తరపున సాయి సుదర్శన్, జితేష్ శర్మ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. సుదర్శన్ వన్డేల్లో.. జితేష్ టీ20 ల ద్వారా  అరంగేట్రం చేశాడు. హర్షిత్ రానా మాత్రం తొలిసారి టీమిండియా నుంచి పిలుపు అందుకున్నాడు. జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. మొత్తం ఐదు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరగనున్నాయి. 8 ఏళ్ల తర్వాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. చివరి సారి ఈ ఇరు జట్ల మధ్య 2016లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగ్గా.. భారత్ 2-0తో గెలిచింది. 

మొదటి రెండు టీ20 మ్యాచ్ లకు భారత జట్టు:

శుభమన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, తుస్హర్ దేశ్ కుమార్, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా