ఆస్ట్రేలియా–ఎతో తొలి అనధికార తొలి టెస్ట్‌లో ఇండియా–ఎ తొలి రోజు తడబడింది. ఆసీస్ బౌలర్ల ధాటికి కేవలం 107 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా రాణించింది. సాయి సుదర్శన్ సూపర్ సెంచరీతో రెండో ఇన్నింగ్స్ లో 312 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా ముందు 225 లక్ష్యాన్ని భారత్ విధించింది. 200 బంతుల్లో 9 ఫోర్లతో 103 పరుగులు చేసి సాయి సుదర్శన్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతనితో పాటు దేవదత్ పడిక్కల్ 88 పరుగులు చేసి భారత్ ను ఆదుకున్నారు.
వీరిద్దరూ మూడో వికెట్ కు 196 పరుగులు జోడించడం భారత ఇన్నింగ్స్ కు హైలెట్. 2 వికెట్లకు 208 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. చివరి 8 వికెట్లను కేవలం 104 పరుగుల తేడాతో కోల్పోయింది. ఇషాన్ కిషన్ 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన వారు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫెర్గుస్ ఓ నీల్ నాలుగు వికెట్లు తీసుకోగా.. మర్ఫీకి 3 వికెట్లు దక్కాయి. డాగెట్, వెబ్ స్టార్ తలో వికెట్ తీసుకున్నారు.
Also Read :- మ్యాచ్‌కు స్పైడర్‌క్యామ్ అంతరాయం.. ముందుగానే లంచ్‌కు
225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కెప్టెన్ మెక్ స్వీనీ (42), వెబ్ స్టర్ (22) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ముఖేష్, ప్రసిద్, సుతార్ తలో వికెట్ తీసుకున్నారు. మరో 96 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా గెలుస్తుంది. మరో వైపు భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. ఆస్ట్రేలియా–ఎ తొలి ఇన్నింగ్స్‌లో 62.4 ఓవర్లలో 195 రన్స్‌కు ఆలౌటైంది. ముకేశ్ 6, ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టారు.
HUNDRED FOR SAI SUDHARSAN IN AUSTRALIA 🇮🇳
— Johns. (@CricCrazyJohns) November 2, 2024
- Sai Sudharsan smashed a brilliant Hundred against Australia A, making a huge statement for the future in the Indian team. 👊 pic.twitter.com/SEZ4aJDcsK