సాయి సూర్య డెవలపర్స్​ ప్రొప్రైటర్ సతీశ్ అరెస్ట్

సాయి సూర్య డెవలపర్స్​  ప్రొప్రైటర్ సతీశ్ అరెస్ట్
  • అక్రమ లేఅవుట్లు సృష్టించి ప్లాట్లు అమ్మినట్లు ఆరోపణలు 

గచ్చిబౌలి, వెలుగు: ఫేక్​ డాక్యుమెంట్లతో  ప్రజలకు ప్లాట్లను కట్టబెట్టి కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సాయి సూర్య డెవలపర్స్​ ప్రొప్రైటర్​సతీశ్​చంద్ర గుప్తాను సైబరాబాద్​ ఎకనామిక్​ అఫెన్సెస్​ వింగ్ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏపీలోని నెల్లూరుకు చెందిన కంచర్ల సతీశ్​చంద్రగుప్తా రాయదుర్గంలో సాయి సూర్య డెవలపర్స్​ పేరిట రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేశాడు. 

నరేందర్​ అనే వ్యక్తి  భాగ్యనగర్ ​ప్రాపర్టీస్​ లిమిటెడ్​కంపెనీని ఏర్పాటు చేసి ఎండీగా కొనసాగుతున్నాడు. వట్టినాగులపల్లిలోని ఓ లేఅవుట్​లో 260 గజాల ప్లాట్​ను నాచారానికి చెందిన రిటైర్డ్​ హెచ్ఎంటీ ఉద్యోగి గోపాల్​రెడ్డికి  వీరు 3.25 కోట్లకు అమ్మారు. అడ్వాన్స్​గా  1.45 కోట్లు అందజేశారు. అయినా ప్లాట్​ను రిజిస్ర్టేషన్​ చేయలేదు.  మోసపోయినట్లు గుర్తించిన గోపాల్​రెడ్డి.. సైబరాబాద్​ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ఈవోడబ్ల్యూ పోలీసులు సతీశ్​చంద్ర గుప్తాను అరెస్ట్​ చేశారు. నరేందర్​పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.