కన్నులవిందుగా రాయికల్ జలపాతం.. పర్యాటకుల కేరింతలు

కన్నులవిందుగా రాయికల్ జలపాతం.. పర్యాటకుల కేరింతలు

కరీంనగర్: వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి పచ్చని అందాలు.. జలపాతాల సోయగాల కోసం ప్రకృతి ప్రేమికులు బయలుదేరుతారు. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాలకు పర్యాటకుల తాకిడి తాకింది. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, చెరువులు, వంకలు కలకళను సంతరించుకున్నాయి. జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లాలోని బొగత వాటర్  వాల్స్, అదిలాబాద్ లోని కుంతల, ఇంకా పలు ప్రాంతాల్లో చిన్న చిన్న జలపాతాలు చూడచక్కని దృష్యాలుగా మారాయి. దీంతో విజిటర్స్ తో ఆయా ప్రాంతాల్లో సందడి పెరిగింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోపాటు వాటర్ వాల్స్ చూడడానికి వస్తున్నారు.