యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం సైదాపురం చెరువులోకి వచ్చే వాగును పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సైదాపురం గ్రామస్తులు డిమాండ్ చేశారు. పూడ్చిన వాగు వద్ద సైదాపురం, మాసాయిపేట గ్రామస్తులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సైదాపురం చెరువులోకి వచ్చే గొలుసుకట్టు కాల్వను పూడ్చడంతో.. సైదాపురం, మాసాయిపేట, బాహుపేట, కుమ్మరిగూడెం, యాశోజీగూడెం, మైలారుగూడెం గ్రామాల చెరువులు ఎండుతాయన్నారు. దాదాపుగా ఆరు గ్రామాల చెరువులను నింపే కాల్వను పూడ్చడం ఏంటని ప్రశ్నించారు.
దీని వాళ్ల రైతులకు, గ్రామస్థులకు నష్టం కలుగుతుందని చెప్పారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో రైతులు ఎగ్గిడి నర్సయ్య, పులెపాక మల్లయ్య, శేఖర్ గౌడ్, జానకిరాములు, జహంగీర్ గౌడ్, ఎలేందర్ రెడ్డి, నసీరుద్దీన్, సత్యప్రకాశ్, రాములు, కృష్ణ, రాజు, సిద్దిరాజు, కిష్టయ్య పాల్గొన్నారు.
కేసు నమోదు
కాల్వను పూడ్చిన ఇద్దరిపై యాదగిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సైదాపురం గ్రామానికి చెందిన కనుకుల సిద్ధారెడ్డి, మల్లాపురం గ్రామానికి చెందిన గౌడ సిద్ధులు వాగును పూడ్చి ఆక్రమించారని ఇరిగేషన్ ఆఫీసర్లు నిర్ధారించి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సదరు వ్యక్తులపై పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీఐ రమేశ్ తెలిపారు.