నల్లగొండలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. 7 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నా రు. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మెదక్ , నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో  లీడ్ లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నల్లగొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి  అసహనంతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.