యాక్టర్ సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో నిందితుడికి ఐదు రోజుల పోలీస్ కస్టడి విధించింది కోర్టు. ముంబైలోని బాంద్రా నివాసంలో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసింది నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ గా గుర్తించారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. సైఫ్ అలీఖాన్ పై దాడి వెనక అంతర్జా తీయ కుట్ర ఉండే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.
నిందితుడు బంగ్లాదేశ్ పౌరుడు.. అంతర్జాతీయ కుట్ర లేదనేది చెప్పలేం.. విచారణ అధికారికి సమయం ఇవ్వాలి.. నిందితుడు మహ్మద్ ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తున్నామని కోర్టు పేర్కొంది.
2025 జనవరి 16 న ముంబైలోని బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. 54ఏళ్ల సైఫ్ ను స్థానిక లీలావతి ఆస్పత్రికి తరలించగా అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నాడు.
ALSO READ | సైఫ్ అలీఖాన్పై దాడి చేసింది బంగ్లాదేశ్ పౌరుడు..!
కోర్టు విచారణ సందర్భంగా.. నిందితుడు దేశంలోకి ఎలా ప్రవేశించాడు.. ఏలక్ష్యంతో ప్రవేశించాడు.. అతనికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు వంటి అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంది.. 14 రోజుల కస్టడీ ఇవ్వాలని విచారణ అధికారి కోర్టును అభ్యర్థించారు.
అయితే నిందితుడు ముంబైలోనే నివాసముంటున్నాడు.. సైఫ్ అలీఖాన్ సెలబ్రిటీ కావడంతో ఈ కేసులు అధికారులు సంచలనం చేశారని డిఫెన్స్ లాయర్ వాదించారు. ఈ కేసులో సైఫ్ అలీఖాన్ ప్రమేయం ఉన్నందున అనవసరంగా ప్రచారం జరుగుతోంది.. లేకుంటే సాధారణ కేసుగానే పరిగణించేవారు.. రిమాండ్ దరఖాస్తులో స్పష్టకారణాలు చెప్పలేదని అన్నారు.
డిఫెన్స్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ పోలీసుల అభ్యర్థనను కోర్టు సమర్థించింది. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని అరెస్టు ఇటీవలే జరిగిందని పేర్కొంది. అందువల్ల, తగినంత కాలం విచారణ కోసం రిమాండ్ అనుమతిస్తున్నాం.. డిఫెన్స్ లాయర్ లేవనెత్తిన అరెస్టులో చట్టవిరుద్ధమైన కారణం సరైన కారణం లేదు అని కోర్టు తీర్పు చెప్పింది.