Saif Ali Khan: వీడేనంట.. సైఫ్ అలీఖాన్ ను కత్తితో ఆరు పోట్లు పొడిచింది..!

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై గురువారం తెల్లవారుజామున దొంగ కత్తితో దడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో బాలీవుడ్ సినీ పరిశ్రమతోపాటూ ముంబై నగరం మొత్తం ఉలిక్కిపడింది. అయితే ఓ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఉదయం 2:30 గంటల సమయంలో దొంగతననానికి రావడంతో అది గమనించి సైఫ్ అలీఖాన్ దొంగని అడ్డుకునే ప్రయత్నం చెయ్యగా దొంగ అతడిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో సైఫ్ కి దాదాపుగా 6 కత్తి పోట్లు పడగా తీవ్రంగా గాయపడ్డాడు. 

దీంతో ఈ కేసుని పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు ఆధారంగా ఛేదించేందుకు యత్నిస్తున్నారు. ఇందులో సైఫ్ ఇంట్లోకి దొంగ చొరబడుతున్న సమయంలో అతడి ఫోటోని గుర్తించారు. ఈ వీడియోలో దొంగ ముఖానికి ఎటువంటి మాస్క్ ధరించకుండా ధైర్యంగా సీసీ కెమెరాలని చూస్తూ మెట్లు దిగుతూ కనిపించాడు. దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగతనం చేసే ఉద్దేశంతో రాలేదని దీనివెనుక మరేదో కారణం కచ్చితంగా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ | ఒక్క ఘటనతో అలా ఎలా అంటావ్..? సైఫ్ అలీఖాన్ ఘటనపై ఫడ్నవీస్, కేజ్రీవాల్ మధ్య డైలాగ్ వార్

ఈ విషయం ఇలా ఉండగా ఘటన జరిగిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ని ఆయన కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ఆటోలో తన ఇంటికి దగ్గర్లో ఉన్న లీలావతి హాస్పటల్ కి హుటాహుటీన తరలించాడు. దీంతో సమయానికి సైఫ్ హాస్పిటల్ లో చేరడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సైఫ్ ఆలీ ఖాన్ ని పరామర్శించేందుకు సెలబ్రేటీలు, సన్నిహితులు లీలావతి హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు.