రాహుల్ గాంధీ ధైర్యవంతుడు.. నిజాయితీ పరుడు : సైఫ్ అలీఖాన్

రాహుల్ గాంధీ ధైర్యవంతుడు.. నిజాయితీ పరుడు : సైఫ్ అలీఖాన్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ప్రశంసలు కురిపించారు.  రాహుల్ గాంధీ ధైర్యవంతుడు, నిజాయితీ గల పొలిటికల్ లీడర్ అని కొనియాడారు. ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో  సైఫ్ అలీఖాన్.. రాహుల్ తనకు ఇష్టమైన లీడర్ అని చెప్పారు.

 దేవర పార్ట్ 1 మూవీని  ప్రమోట్ చేస్తున్న సైఫ్  అలీఖాన్.. సెప్టెంబర్ 26న   ఓ నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ కార్యక్రమంలో  మీరు ఎలాంటి రాజకీయ నాయకుడిని ఇష్టపడతారు అని హోస్ట్   అడగ్గా.. ధైర్యమైన , నిజాయితీ గల రాజకీయ నాయకుడు తనకు ఇష్టమని చెప్పాడు సైఫ్.

Also Read :- పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్

 అపుడు హోస్ట్..  పీఎం నరేంద్ర మోదీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీలను  ఎగ్జాంపుల్ గా చెప్పి..వీళ్లలో  ధైర్యమైన రాజకీయ నేత ఎవరో చెప్పాలని సైఫ్ ను కోరారు. దీనికి సైఫ్ బదులిస్తూ ..వాళ్లంతా ధైర్యవంతులే..కానీ రాహుల్ గాంధీ  చేసే పనులు..మాట్లాడే విధానం,  నన్ను బాగా ఆకట్టుకున్నాయని బదులిచ్చారు. రాహుల్ ను ప్రశంసించిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్  సపోర్టర్స్ తెగ షేర్ చేస్తున్నారు.

దేవర పార్ట్ 1 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ఇండియా యాక్షన్ ఫిల్మ్‌లో సైఫ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ , జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది.