టాలీవుడ్ లో హీరోలను దేవుళ్ళలా చూస్తారు: సైఫ్ అలీ ఖాన్

టాలీవుడ్ లో హీరోలను దేవుళ్ళలా చూస్తారు: సైఫ్ అలీ ఖాన్

బాలీవుడ్ లో తెలుగు హీరోల చిత్రాలు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ చిత్రాలకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు బాలీవుడ్ హీరోలు తెలుగు చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవలే తెలుగులో ప్రముఖ హీరో ఎన్టీఆర్ హీరో గా నటించిన దేవర చిత్రం మంచి హిట్ అయింది. ఈ చిత్రంలో బాలీవడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించాడు. కాగా సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై మరియు హీరోలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఇందులో భాగంగా టాలీవుడ్ లోని దర్శక నిర్మాతలు ఆడియన్స్ కి ఏం కావాలనే విషయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉన్నారని అందుకే హిట్ చిత్రాలని తీయగలుగుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే అక్కడి ప్రజలు కూడా హీరోలని దేవుళ్ళలా చుస్తారాని చెప్పుకొచ్చాడు. ఇక వ్యక్తిగతంగా భాష ఏదైనాసరే ఒక్కసారి కెమెరా ముందుకి వస్తే అందరిదీ సినిమా భాష అని ఈ విషయం తనకి చాలా బాగా నచ్చిందని సైఫ్ తెలిపాడు.

ALSO READ | Samantha: హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం..'వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు కైవసం

అయితే తాను మొదట్లో దేవర షూటింగ్ సమయంలో డైలాగులు చెప్పే విషయంలో కొంతమేర ఇబ్బంది పడ్డానని కానీ దర్శకుడు కొరటాల ఈ విషయంలో ఎంతో సహాయం చేశాడని తెలిపాడు. అలాగే భవిష్యత్ లో తనకి తెలుగు చిత్రాల్లో నటించే ఆఫర్లు వస్తే కచ్చితంగా నటిస్తానని స్పష్టం చేశాడు.

ఈ విషయం ఇలా ఉండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించిన దేవర చిత్రం విడుదలైన మొదటిరోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ. 172 కోట్లు (గ్రాస్) వసూళ్లు సాధించింది. వారాంతంలో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.