సైఫ్ అలీఖాన్ కేసు : కత్తితో పొడిచినోడు ముంబైలోనే దొరికాడు

సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డ నిందితుడిని పార్త్తుకున్నారు ముంబై పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి గాలింపు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని బాంద్రా పొలిసు స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. సైఫ్ ఇంట్లోని తల్వార్ తోనే నిందితుడు దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడికోసం ముంబైలోని వాసాయి నల్లసొపారా, విరార్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల్లో గాలింపు చేపట్టారు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

బుధవారం ( జనవరి 15, 2025 ) అర్ధరాత్రి ముంబైలోని బాంద్రా వెస్ట్‌‌‌‌లోని సైఫ్ ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో సైఫ్ వెన్నెముక, మెడ, ఎడమ చేయి సహా ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి.  సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన నర్సు ఇలియామా ఫిలిప్(56)..భయంతో కేకలు వేసింది. వెంటనే దుండగుడు ఆమె వద్దకు వెళ్లి కత్తితో బెదిరించి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నర్సు కేకలతో అక్కడికి చేరుకున్న  సైఫ్ దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

Also Read :- టార్గెట్ తో ముందుకెళ్తున్న ప్రభుత్వం..

కానీ దుండగుడు  కత్తితో దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. అయితే, కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్ ను అతని పెద్ద కొడుకు ఇబ్రహీం.. ఆటోలో  ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించాడు. ట్రీట్మెంట్ అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ.. దాడిలో సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయమైనట్లు ప్రకటించారు. అక్కడ ఇరుక్కుపోయిన 2.5 అంగుళాల కత్తి ముక్కను సర్జరీ చేసి తొలగించినట్లు తెలిపారు. దీంతోపాటు వెన్నెముకలోని ద్రవాలు లీక్ కాకుండా సరిచేశామన్నారు. సైఫ్ ఎడమ చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఐసీయూలో సైఫ్ కోలుకుంటున్నాడని, ప్రాణాపాయం లేదన్నారు. 

#WATCH | Saif Ali Khan Attack Case | Mumbai Police bring one person to Bandra Police station for questioning.

Latest Visuals pic.twitter.com/fuJX9WY7W0

— ANI (@ANI) January 17, 2025