
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బంగ్లాదేశీ వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు కలెక్ట్ చేసిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో మ్యాచ్ అవ్వలేదని తెలుస్తోంది. పోలీసులు మొత్తం 20 శాంపిల్స్ కలెక్ట్ చేయగా అందులో 19 శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని తెలుస్తోంది.
ALSO READ | న్యూయార్క్‌లో విమాన ప్రమాదం భారత సంతతి వైద్యురాలు మృతి.. ఆమె ఫ్యామిలీ కూడా దుర్మరణం
జనవరి 16న సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు సైఫ్ పై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ ఒంటిపై ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. దుండగుల దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. రెండు చోట్ల లోతుగా గాయాలు.. వెన్నెముక పక్కన గాయం అయినట్లు గుర్తించిన డాక్టర్లు సైఫ్ కి సర్జరీ చేశారు.
జనవరి 16న తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోకి ప్రవేశించారు దుండగులు. పని మనిషితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. సైఫ్ కలుగజేసుకొనే వరకు నేరుగా సైఫ్ పై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తించి విచారణ జరుపుతున్న ఈ కేసులో తాజా పరిణామం బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి.