సినిమాల్లో హీరో ఫైటింగ్ తర్వాత.. ఒళ్లంతా రక్తంతో.. నడవలేని పరిస్థితుల్లో.. ఒకరి సాయంతో.. ఏదో ఒక బండిలో ఆస్పత్రికి వెళ్లటం రెగ్యులర్‌గా.. మన తెలుగు రొటీన్ సినిమాల్లో చూస్తూనే ఉంటాం.. అలాంటి అనుభవమే ఇప్పుడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌కు ఎదురైంది. అవును.. పైన చెప్పినట్లు అచ్చం సేమ్ టూ సేమ్ అలాగే జరిగిందని అతని కుమారుడు ఇబ్రహీం వెల్లడించాడు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబైలోని బాంద్రా ఏరియాలోని తన అపార్ట్ మెంట్ ప్లాట్‌లో ఆగంతకుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు సైఫ్ అలీఖాన్. శరీరంపై ఆరు కత్తిపోట్లు.. రెండు బలంగా తగిలాయి. ఒళ్లంతా రక్తం.. ఇంట్లోని పనోళ్ల సమాచారంతో అప్పటికిప్పుడు ఇంటికి వచ్చిన కుమారుడు ఇబ్రహీం.. తండ్రిని ఆస్పత్రికి తరలించటానికి వేగంగా కదిలాడు. అపార్ట్ మెంట్ ప్లాట్ నుంచి కిందకు.. తన చేతులతో తీసుకొచ్చాడు. అప్పటికే కారు బయలుదేరటానికి సిద్ధంగా లేదు.. ఇంట్లో చాలా కార్లు ఉన్నా.. రెడీ టూ మూవ్ అనే విధంగా ఒక్క కారు కూడా లేదు..
ALSO READ | Saif Ali Khan Attacked : వెన్నెముక నుంచి కత్తి మొన తీసిన డాక్టర్లు..
అప్పటికే ఆలస్యం అవుతుందని.. ఆస్పత్రికి అర్జంట్‌గా వెళ్లాలనే ఉద్దేశంతో.. అపార్ట్ మెంట్ గేటు దాటి.. రోడ్డుపై ఉన్న ఆటోను తీసుకున్నాడు. తండ్రిని ఆటోలో ఎక్కించుకుని.. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సరైన సమయానికి తీసుకొచ్చారు అన్న డాక్టర్ల మాటలు వింటుంటే.. కుమారుడు ఇబ్రహీం ఆ సమయంలో ఎలా స్పందించాడు అనేది ఇప్పుడు స్పష్టం అవుతుంది.
ఒళ్లంతా రక్తంతో.. తీవ్ర గాయాలతో ఉన్న తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లటానికి కారు మాత్రమే రావాలి.. అంబులెన్స్ కోసం వెయిటింగ్.. వాళ్లకు వీళ్లకు ఫోన్లు చేయటం ఇలాంటి మాటలతో టైం వేస్ట్ చేయకుండా.. దొరికిన వాహనంలో.. తండ్రిని సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లటం అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.