Saif Ali Khan Attacked : వెన్నెముక నుంచి కత్తి మొన తీసిన డాక్టర్లు..

సైఫ్ అలీఖాన్ వెన్నెముక నుంచి 2.5 ఇంచుల కత్తి మొనను బయటికి తీశారు డాక్టర్లు. సైఫ్ తగిలిన ఆరు కత్తి పోట్లలో వెన్నెముకకు తగిలిన గాయమే పెద్దదని డాక్టర్లు తెలిపారు. వెన్నెముక, మెడపైన తగిలిన గాయానికి 
 సర్జరీ చేశామని, ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం పరిస్థితి ఔట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు తెలిపారు. 

సైఫ్ వెన్నెముకలో దిగిన కత్తిని తీయడానికి సర్జరీ చేశామని, మోచేతికి, మెడపై గయాలకు ప్లాస్టిక్ సర్జీ చేశామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం సైఫ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, కోలుకుంటున్నారని లీలావతి హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 

Also Read :- సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీఖాన్‌ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. గురువారం(జనవరి 16) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ ఆగంతకుడు పదునైన కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటీన కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నటుడు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.