ఖమ్మం జైలు నుంచి సైఫ్​ విడుదల

ఖమ్మం, వెలుగు : వరంగల్​ కాకతీయ మెడికల్‍ కాలేజీ ఫస్ట్​ఇయర్​ స్టూడెంట్​ధరావత్​ ప్రీతి సూసైడ్​ ఘటనలో నిందితుడు డాక్టర్ సైఫ్ ​బెయిల్ పై రిలీజ్​అయ్యాడు. వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు బుధవారం కండీషన్లతో బెయిల్ ​మంజూరు చేసింది. బెయిల్ పేపర్లు ఆలస్యంగా రావడంతో గురువారం ఖమ్మం జిల్లా జైలు నుంచి సైఫ్ ​బయటకు వచ్చాడు. ఫిబ్రవరి 22న వరంగల్‍ఎంజీఎం హాస్పిటల్​లో డ్యూటీ సమయంలో ప్రీతి సూసైడ్‍ చేసుకున్నట్లు వరంగల్​మట్వాడా పోలీస్‍స్టేషన్​లో కేసు నమోదైంది.

ఆపై మెరుగైన ట్రీట్‍మెంట్‍పేరుతో హైదరాబాద్​నిమ్స్​కు తరలించారు. అదే నెల 24న ప్రీతి ఆత్మహత్యకు సీనియర్​ స్టూడెంట్​ సైఫ్​ను  బాధ్యుడిని చేస్తూ వరంగల్​పోలీసులు ర్యాగింగ్‍, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదేరోజు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఇది జరిగాక రెండు రోజులకే ప్రీతి చనిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రీతి ఘటనలో సైఫ్‍ ఫిబ్రవరి 24న అరెస్ట్​ కాగా దాదాపు 55 రోజుల తర్వాత కండీషన్లతో కూడిన బెయిల్‍మంజూరైంది. సైఫ్‍ తరఫున ఆయన లాయర్లు గతంలో రెండుసార్లు బెయిల్‍ పిటిషన్​ పెట్టుకోగా కోర్టు తిరస్కరించింది. బుధవారం మరోసారి పిటిషన్ ​ఫైల్ ​చేయగా  ​మంజూరు చేసింది.