తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందిన ఖైరతాబాద్ బడా గణేష్‌ను రోజుకు లక్షమందికి పైగా భక్తులు దర్శించుకుంటున్నారని సైఫాబాద్ ఏసిపి సంజయ్ కుమార్ అన్నారు. లాస్ట్ వీకెండ్ లో అయితే ఆ సంఖ్య రెండు లక్షలకు పైగా ఉందన్నారు. ప్రజలందరూ సాయంత్రం వేళ దర్శనాలకు వస్తుండడంతో ఆ టైంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. నతరాత్రులు దగ్గర పడుతుండటంతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని.. మార్నింగ్ టైంలో దర్శనాలకు వస్తే మంచిదని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
వృద్ధులు, చిన్నపిల్లలు క్రౌడ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో వచ్చి ఇబ్బందులు పడొద్దని కోరారు. సెప్టెంబర్17న ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి బయలుదేరుతాడని భద్రతా ఏర్పాటు పర్యవేక్షించే ఏసిపి అధికారి తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలలోపే నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్16 వరకే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామని అన్నారు. బడా గణేష్ చుట్టూ ఉన్న భారీ సెట్టింగ్లు, బ్యారిగేట్లు తొలగించే పని 16న ప్రారంభిస్తారు. ఆ రోజు దర్శనానికి అనుమతి ఉండదని భక్తులు గమనించాలి. నిమజ్జనానికి ట్యాంక్ బండ్ దగ్గర పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాము. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి వెళ్లే రూట్ మొత్తం పకడ్బందీగా ఏర్పాటు చేశాము.