
వీణవంక, వెలుగు : కరీంనగర్ జిల్లా వీణవంక శివాలయంలో మహాశివరాత్రి వేడుకల్లో శివుని సైకత ప్రతిమ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. కరీంనగర్ టౌన్ కు చెందిన రేవల్లి శంకర్ సైకత శివయ్యను తీర్చిదిద్దాడు . బుధవారం ఉదయం సుమారు 100 మందికి పైగా దంపతులు ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. సైకత శిల్పాన్ని రూపొందించిన శంకర్ ను ఆలయ కమిటీ, భక్తులు అభినందించారు.