
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకుల విద్యార్థులకు యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ లో సెయిలింగ్ పై శిక్షణ ఇస్తున్నట్టు బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు. ఈ శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బేసిక్ ఫౌండేషన్ కోర్సుకు అర్హత సాధిస్తారని చెప్పారు. బేసిక్ కోర్సులో అర్హత పొందిన వారికి మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారు జాతీయ, అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తుందని బుధవారం పత్రిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాల్లో చదువుతున్న 14 ఏండ్లలోపు విద్యార్థులలో ఆసక్తి గలవారిని ఈ శిక్షణకు ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు.