ఇండియన్ నేవీ సెయిలర్ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ 02/2024 బ్యాచ్) డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్, చీఫ్ పెట్టీ ఆఫీసర్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 20 వరకు అప్లై చేసుకోవచ్చు.
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్, గోల్ఫ్, టెన్నిస్, సెయిలింగ్ తదితరాలు.
అర్హత: 10+2 ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్/ జూనియర్ లేదా సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులై ఉండాలి. వయసు 17 1/2 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థి 1 నవంబర్ 1999 - నుంచి 30 ఏప్రిల్ 2007 మధ్య జన్మించి ఉండాలి. పురుషులు 157 సెం.మీ, మహిళలు 152 సెం.మీ. ఎత్తు ఉండాలి.
సెలెక్షన్: స్పోర్ట్స్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ట్రైనింగ్ ఐఎన్‌ఎస్ చిల్కా, ఒడిశాలో ఉంటుంది.
అప్లికేషన్స్: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సెక్రటరీ, ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, 7వ అంతస్తు, చాణక్య భవన్, నౌకాదళ ప్రధాన కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ అడ్రస్‌కు జులై 20 వరకు పంపాలి. వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.